![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu)'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-435 లో.. శ్రీవల్లి గురించి భాగ్యం టెన్షన్ పడుతుంది. ఆనందరావు వచ్చి సరసాలు ఆడుతుంటే భాగ్యం చీవాట్లు పెడుతుంది. అప్పుడే శ్రీవల్లి ఫోన్ చేస్తుంది. ప్రేమ ఫోన్ లో వాయిస్ రికార్డింగ్ డిలీట్ చేశానని శ్రీవల్లి చెప్పగానే భాగ్యం , ఆనందరావు ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతారు. శ్రీరామనవమి రోజు వాళ్ళకి చుక్కలు చూపించాలి మీరు తొందరగా వచ్చేయండి అని భాగ్యం, ఆనందరావులతో శ్రీవల్లి చెప్పి కాల్ కట్ చేస్తుంది. ఇక వెనక్కి తిరిగి చూసేసరికి చందు ఉంటాడు. మరోవైపు అమూల్యని ప్రేమ పిలుస్తుంది. మీ చందు అన్నయ్య నిన్ను పిలుస్తున్నాడు గార్డెన్ లో ఉన్నాడని చెప్పగానే తను గార్డెన్ వైపు వస్తుంది. అలాగే నర్మదని తీసుకొని ప్రేమ గార్డెన్ కి వస్తుంది. ఇక చందు, శ్రీవల్లి గార్డెన్ లో మాట్లాడుతుంటారు.
విశ్వని అమూల్య ప్రేమించమని చెప్పిన వ్యక్తి ఎవరో నీకు తెలుసు..ఎవరని శ్రీవల్లిని చందు అడుగగా.. ప్రేమ అని చెప్తుంది. తన అన్నయ్య కోసం ఇలా చేసిందని లేనిపోనివి అన్నీ చెప్తుంది శ్రీవల్లి. అదంతా అమూల్య వింటుంది. వదిన అంటూ కోపంగా శ్రీవల్లి దగ్గరికి వస్తుంది. అసలు నువ్వు మనిషివేనా నీ కాపురం బాగుండటం కోసం ప్రేమ వదిన కాపురం నాశనం చేయాలని చూస్తావా అని తిడుతుంది. నీ కాపురం నాశనం అవుద్దని నర్మద, ప్రేమ వదినల దగ్గర మాట తీసుకొని నువ్వు చేసిన మోసాన్ని ఎవరికి చెప్పకుంటే ఇలా చేస్తావా అని శ్రీవల్లిని అమూల్య తిడతుంది. ఏమైందని చందు అడుగగా.. శ్రీవల్లి చేసిన మోసం మొత్తం చెప్తుంది. విశ్వని ప్రేమించడానికి కారణం వల్లి వదిన, పెళ్లి ముందురోజు రాత్రి కూడా నేను బయటకు వెళ్ళడానికి వల్లి వదినే కారణం అనగానే చందు తన చెంప చెల్లుమనిపిస్తాడు. అమూల్యకి ఇచ్చిన మాట కోసం నిజం చెప్పకుండా ఉంటే తను మాత్రం నా కాపురంలో చిచ్చు పెట్టాలని చూసిందని ప్రేమ అంటుంది. మీ భార్యలు ఎలాంటివారో తెలుసుకోకుండా వాళ్ళతో ఎలా ఉంటున్నార్రా అని సాగర్, ధీరజ్ లని అడిగారు కదా బావ.. మీ భార్య గురించి మీకు తెలియాలనే ఇలా చేశాం బావ.. ఇక నిర్ణయం మీదే అని నర్మద అంటుంది.
మరోవైపు ఇంట్లో శ్రీరామనవమి సందర్భంగా పూజ కోసం వేదవతి అన్ని ఏర్పాట్లు చేస్తుంది. కాసేపటికి పూజారి వస్తాడు. వేదవతి అందరిని పిలుస్తుంది. ఇక మరోవైపు చందు తన గదిలోకి వెళ్ళి శ్రీవల్లి బట్టలు అన్నీ సర్దుతుంటాడు. ఆ నర్మద, ప్రేమ కావాలనే ఇలా చేశారు బావ.. నా తప్పేం లేదు బావ అని ఏడుస్తూ రిక్వెస్ట్ చేస్తుంది శ్రీవల్లి . నీ దొంగ ఏడుపు చాలు.. పదా అని చెప్పి ఇంటి వెనుక నుండి బ్యాగ్ తో పుట్టింటికి తీసుకెళ్తాడు. నీ జీవితమే అబద్ధం.. ఇంకెప్పుడు నాకు నీ ముఖం చూపించకు.. అబద్దాలతో మోసాలతో పెళ్ళి చేస్తే ఇలాగే ఉంటుందని మీ వాళ్ళతో చెప్పు అని శ్రీవల్లిని భాగ్యం వాళ్ళ ఇంటి దగ్గర వదిలేసి వెళ్తాడు చందు. మరోవైపు భాగ్యం, ఆనందరావు రెడీ అయి వస్తుంటారు. అప్పుడే శ్రీవల్లి వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. ఏంటి అమ్మడు వస్తున్నాం కదా.. ఎందుకు వచ్చావ్ అని భాగ్యం అడుగుతుంది. సంపేత్తాను అని కోపంగా వాళ్ళ మీద అరుస్తుంది శ్రీవల్లి. ఆ తర్వాత బాధగా ఏడుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |